Suhas Latest Hey Balwanth Locks OTT Streaming Date

Hey Balwanth
March 24, 2026

LATEST NEWS

Suhas Latest Hey Balwanth Locks OTT Streaming Date

Published on Mar 23, 2026 4:01 PM IST

కలర్ ఫోటో, ప్రసన్న వదనం వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్ నటించిన తాజా చిత్రం ‘హే బలవంత్’(Hey Balwanth). గోపీ అచ్చర దర్శకత్వంలో తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మార్చి 31, 2026 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథాంశం ఆసక్తికరంగా సాగుతుంది. తన తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా తీసుకోవాలనుకునే కృష్ణ అనే యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. అయితే, తండ్రి అతడిని ఆ వ్యాపారానికి దూరంగా ఉంచుతాడు. ఆ వ్యాపారం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకున్న కృష్ణ, దానిని ఎలా అడ్డుకున్నాడు అనేదే ఈ చిత్ర ప్రధానాంశం. శివాని నగరం హీరోయిన్‌గా నటించగా నరేష్, వెన్నెల కిశోర్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు.

తొలుత ‘హే భగవాన్’ అనే టైటిల్ అనుకున్నప్పటికీ, సెన్సార్ అభ్యంతరాల వల్ల ‘హే బలవంత్’గా మార్చారు. థియేటర్లలో ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయినా, సుహాస్ నటన మరియు కామెడీ, ఎమోషన్స్ సమపాళ్లలో ఉండటంతో ఓటీటీ ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.

Share this post:

POLL

Who Will Vote For?

Other

Republican

Democrat

RECENT NEWS

Cooking gas shortage creates food woes in Tirumala

Cooking gas shortage creates food woes in Tirumala

Coyle: ‘A positive step’: Taliban frees American academic Dennis Coyle after more than a year in detention

Coyle: ‘A positive step’: Taliban frees American academic Dennis Coyle after more than a year in detention

Dhurandhar 2

Ranveer Singh’s Dhurandhar The Revenge bails out theatres in Telugu states

Dynamic Country URL Go to Country Info Page