Sangeet Shoban Gamblers Movie Review in Telugu, Rating

Sangeet Shoban Gamblers Movie Review in Telugu, Rating
June 6, 2025

LATEST NEWS

Sangeet Shoban Gamblers Movie Review in Telugu, Rating

విడుదల తేదీ : జూన్ 06, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : సంగీత్‌ శోభన్‌, ప్రశాంతి చారులింగా, రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి తదితరులు.
దర్శకత్వం : కేఎస్‌కే చైతన్య
నిర్మాతలు : సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం
సంగీతం : శశాంక్ తిరుపతి
సినిమాటోగ్రఫీ : ప్రేమ్ సాగర్
ఎడిటర్ : శశాంక్ మాలి

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

సంగీత్‌ శోభన్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘గ్యాంబ్లర్స్‌’. ప్రశాంతి చారులింగా నాయికగా నటించిన ఈ చిత్రంలో రాకింగ్‌ రాకేష్‌ పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

మిస్టరీ థ్రిల్లర్‌ జానర్‌లో ఈ కథ సాగింది. ఓ క్లబ్ చుట్టూ సాగిన ఈ కథలో అసలు డైమండ్ ట్రాక్ ఏమిటి ?, ఆ డైమండ్ కోసం ఏంజెల్ (సంగీత్ శోభన్), గాయత్రి (ప్రశాంతి చారులింగా) లతో పాటు చిదంబదరం (శ్రీకాంత్ అయ్యంగార్), కృపా (జస్వికా), లాంగ్డీ (రాకింగ్ రాకేష్), పార్థు (పృధ్వీరాజ్ బన్నా) లతో సహా మొత్తం ఐదుగురు ఆ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసలు ఏంజెల్ (సంగీత్ శోభన్) వెనుక ఉన్న కథ ఏమిటి ?, ఏ సీక్రెట్స్ ను బయటపెట్టాలని ఏంజెల్ ప్రయత్నం చేస్తాడు ?, ఈ సంఘటనల అనంతరం ఏంజెల్ వేసిన ప్లాన్ ఏమిటి ?, చివరకు ఆ డైమండ్ ట్రాక్ ఎలాంటి మలుపు తిరిగింది ?, ఫైనల్ గా ఏంజెల్ – గాయత్రిలతో పాటు మిగిలిన పాత్రల పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన ‘సంగీత్‌ శోభన్‌’ తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్ని కీలక సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ప్రధానంగా సెకండ్ హాఫ్ లో తన పర్ఫార్మెన్స్‌తో సంగీత్‌ శోభన్‌ ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేశాడు. మరో ప్రధాన పాత్రలో నటించిన ప్రశాంతి చారులింగా కూడా చాలా బాగా నటించింది. జస్విక మెప్పించింది. ఇక రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌ బన్నల నటన బాగుంది. మెయిన్ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే మెయిన్ ఎపిసోడ్స్ కూడా బాగానే ఉన్నాయి.

అదేవిధంగా దర్శకుడు కేఎస్‌కే చైతన్య ఒక సీక్రెట్ సొసైటీ ఆధారంగా నడిచే మిస్టరీ థ్రిల్లర్ చుట్టూ అనేక కోణాల్లో సినిమాని నడిపిన విధానం కొన్ని చోట్ల బాగుంది. సాయి శ్వేత, భరణి శంకర్‌, మల్హోత్త్ర శివ, శివారెడ్డి తదితరులతో పాటు ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మొత్తానికి కథలో ట్విస్ట్‌లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లతో ఈ సినిమా కొన్ని చోట్ల బాగానే సాగింది.

మైనస్ పాయింట్స్:

ఈ ‘గ్యాంబ్లర్స్‌’ సినిమాలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ డ్రామా ఉన్నా.. చాలా చోట్ల ప్లే మాత్రం చాలా సింపుల్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ బోర్ గా సాగాయి. కేఎస్‌కే చైతన్య ఫస్ట్ హాఫ్ ను ఇంకా బలంగా రాసుకుని ఉండాల్సింది. దీనికితోడు, అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా ఎక్కువైపోయాయి. పైగా ఈ సినిమా స్లో నేరేషన్ తో పాటు బోరింగ్ ట్రీట్మెంట్ అండ్ ఫేక్ ఎమోషన్స్ తో సాగుతుంది. సినిమా మొత్తం క్లబ్ చుట్టే తిరిగింది కాబట్టి, ఆ డ్రామాను ఇంకా బలంగా డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి కన్వెన్స్ చేయాల్సింది.

మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సీన్స్ ఆకట్టుకోవు. ఇక సెకండాఫ్ ని కాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడుపుదామని దర్శకుడు కేఎస్‌కే చైతన్య బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే పూర్తి స్థాయిలో ఎక్కడా ఆ ఎమోషన్ వర్కౌట్ కాలేదు. మొత్తమ్మీద ఈ గ్యాంబ్లర్స్‌ మూవీ మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. కొన్ని సీన్స్ విషయంలో బాగాలేదు. అలాగే, క్లైమాక్స్ లోని సీన్స్ కూడా ఆకట్టుకోవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కేఎస్‌కే చైతన్య కథలో గుడ్ ట్రీట్మెంట్ ను యాడ్ చేసి ఇంట్రెస్ట్ పెంచలేకపోయారు. ప్లే ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. సినిమాలో ప్రేమ్ సాగర్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా నేచురల్ గా చూపించారు. శశాంక్ తిరుపతి సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకా బెటర్ ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనం ల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

తీర్పు :

‘గ్యాంబ్లర్స్‌’ అంటూ వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్‌ ఆకట్టుకోలేదు. సంగీత్ శోభన్ నటన, కథలోని మలుపులు సినిమాకు ప్లస్ అయినా, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సీన్స్ లేకపోవడం, కొన్ని కీలక సన్నివేశాల్లో లాజిక్ మిస్ కావడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. మొత్తమ్మీద ఈ మిస్టరీ థ్రిల్లర్‌ లో కొన్ని ఎలిమెంట్స్ కనెక్ట్ అయినా సినిమా మాత్రం కనెక్ట్ కాదు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Share this post:

POLL

Who Will Vote For?

Other

Republican

Democrat

RECENT NEWS

‘We don’t condone cheating’: IIT Bombay students call for reforms after Sahil’s death | India News

‘We don’t condone cheating’: IIT Bombay students call for reforms after Sahil’s death | India News

Sharwanand

Sharwanand to pocket a huge remuneration for his film with Nagabandham director?

CPM launches agitation for house sites

CPM launches agitation for house sites

Dynamic Country URL Go to Country Info Page