Rashmika Mandanna Thamma Movie Review In Telugu, Ayushmann

Rashmika Mandanna
October 21, 2025

LATEST NEWS

Rashmika Mandanna Thamma Movie Review In Telugu, Ayushmann

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్, సత్యరాజ్ తదితరులు
దర్శకుడు : ఆదిత్య సర్పోట్దర్
నిర్మాతలు : అమర్ కౌశిక్, దినేష్ విజన్
సంగీత దర్శకుడు : సచిన్ జిగర్
సినిమాటోగ్రాఫర్ : సౌరభ్ గోస్వామి
ఎడిటర్ : హేమంతి సర్కార్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘థామా’. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ మిషన్‌పై తన తోటి ఉద్యోగులతో అడవిలోకి వెళ్తాడు. అనుకోకుండా ఓ ఎలుగుబంటి అతడిపై దాడికి యత్నిస్తుంది. ఈ క్రమంలో వ్యాంపైర్ అయిన తడకా(రష్మిక) అతడిని కాపాడుతుంది. దీంతో అలోక్ ఆమెను ఇష్టపడతాడు. అయితే, తడకా కారణంగా అలోక్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది..? అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి..? ఇంతకీ యాక్షసన్(నవాజుద్ధీన్ సిద్ధీఖి) ఎవరు..? తడకాతో అతడికి ఎలాంటి సంబంధం ఉంది..? అనే అంశాలు తెలియాలంటే ‘థామా’ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుండి వచ్చిన సినిమాల్లో ‘థామా’ ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోయినా, కథలోని పాయింట్ బాగుండటం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

రష్మిక మందన్న పాత్రను చాలా చక్కగా రాసుకున్నారు. బాలీవుడ్‌లో రష్మిక చేసిన పాత్రల్లో ఈ పాత్ర చాలా బాగుంది. వ్యాంపైర్‌గా రష్మిక ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా నటించింది.

ఆయుష్మాన్ ఖురానా మరోసారి తన విలక్షణమైన పర్ఫార్మెన్స్‌తో మెప్పించాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఆయుష్మాన్ ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆయన ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాడు. ‘థామా’లో కొన్ని కామెడీ సీన్స్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ ఫ్రాంచైజీలో వచ్చిన మిగతా సినిమాలకంటే ‘థామా’లో ఆసక్తికరమైన కథ ఉంది. కానీ, ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించడంలో ఇది విఫలమైంది. కొన్ని ఫన్నీ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులకు అవి కనెక్ట్ కాలేదు.

సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నా, ఎక్కువగా బోర్ కొట్టించేలా ఈ సినిమా సాగింది. థామా చిత్రానికి కథనం చాలా వీక్‌గా సాగిందని చెప్పాలి. ఎడిటింగ్ టీమ్ ఈ విషయంలో చాలా మెరుగైన పని చేయాల్సింది. ఒకట్రెండు పాటలను కూడా తొలగించి ఉంటే సినిమాకు కలిసొచ్చేది.

ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా మైనస్‌గా నిలిచింది. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో డబ్బింగ్ విషయంలో ఇంకా బెటర్ వర్క్ చేయాల్సింది. క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా ఇంకా బెటర్‌గా రాసుకోవాల్సింది. నవాజుద్దీన్ సిద్ధీఖి పాత్రను కూడా ఇంకా పవర్‌ఫుల్‌గా చూపెట్టాల్సింది.

సాంకేతిక విభాగం :

సచిన్-జిగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలు మెప్పించవు, బీజీఎం కూడా కొంతవరకు వర్కవుట్ అయింది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కానీ, ఎడిటింగ్ విషయంలో ఇంకా బెటర్‌గా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుంది. ఈ సినిమాకు తెలుగు డబ్బింగ్ వర్క్ చాలా బెటర్‌గా ఉండాల్సింది. రైటింగ్ టీమ్ వర్క్ బాగున్నా, దర్శకుడు ఆదిత్య సర్పోట్దర్ ఈ చిత్రాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే, ‘థామా’లో చక్కటి కథ ఉన్నప్పటికీ, ఈ చిత్ర స్క్రీన్ ప్లే సినిమాకు డ్యామేజ్ చేసింది. రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా చక్కటి పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. కానీ, ఈ చిత్రంలోని స్లో పేస్, సాగదీత సీన్స్, బలహీనమైన క్లామాక్స్ ఎపిసోడ్ ఈ చిత్రానికి డ్యామేజ్ చేశాయి. హారర్ కామెడీ చిత్రాలను ఇష్టపడేవారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

Share this post:

POLL

Who Will Vote For?

Other

Republican

Democrat

RECENT NEWS

CM Chandrababu Naidu Emphasises Data-Driven Governance in Review Meeting

CM Chandrababu Naidu Emphasises Data-Driven Governance in Review Meeting

Ram Charan looks stunning in the new poster

Ram Charan looks stunning in the new poster

Samantha And Tamannaah Set Mumbai Night On Fire!

Samantha And Tamannaah Set Mumbai Night On Fire!

Dynamic Country URL Go to Country Info Page