Kareena, Prithviraj’s Daayra Movie Review And Rating In Telugu

Kareena, Prithviraj's Daayra Movie Review And Rating In Telugu
September 17, 2026

LATEST NEWS

Kareena, Prithviraj’s Daayra Movie Review And Rating In Telugu

విడుదల తేదీ : సెప్టెంబర్ 18, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఖాన్, జితేంద్ర జోషి, క్షితీ జోగ్ మరియు ఇతరులు
దర్శకత్వం : మేఘనా గుల్జార్
నిర్మాతలు : ధవల్ జయంతీలాల్ గడా
సంగీతం : అమిత్ త్రివేది
ఛాయాగ్రహణం : సౌరభ్ గోస్వామి ISC
కూర్పు : చారు శ్రీ రాయ్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం బిగ్ స్క్రీన్స్ పై రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అలాగే బాలీవుడ్ నటి కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ డ్రామా దాయర కూడా ఒకటి. పలు నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా మలయాళం, హిందీలో విడుదలైంది. ఇక ఈ థ్రిల్లర్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక దారుణమైన అత్యాచారం జరిగిన సంఘటనతో అది జరిగిన జరిగిన తర్వాత దాని కోసం ఒకొక్కరిగా మాట్లాడుకుంటూ వెళుతూ అది పోలీసు వారికి తలనొప్పిగా మారుతుంది. దీనితో ఎలాగో పోలీసులు కొందరిని పట్టుకొని సీన్ రీక్రియేషన్ అని చెప్పి తీసుకెళ్తారు. ఈ టీం డిసిపి రామన్ కుమార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) నేతృత్వంలో పని చేస్తుంది. అయితే నేరస్థులు తమ ఆయుధాలను లాక్కొని దాడికి పాల్పడటం వల్ల తాము ఆత్మరక్షణ కోసం వారిని చంపినట్టు డీసీపీ రామన్ ఒక కథనాన్ని సృష్టిస్తాడు. ఇక అక్కడ నుంచి మానవ హక్కుల సంఘం (హ్యూమన్ రైట్స్) నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో, దీనిపై విచారణకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తారు, దానికి డీసీపీ అజూనీ కోహ్లీ (కరీనా కపూర్ ఖాన్) నేతృత్వం వహిస్తారు. ఇక ఆ తర్వాత ఏమైంది? అజూని గెలిచిందా లేక రామన్ గెలిచాడా అనేది ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం కాస్త నెమ్మదిగా మొదలైనప్పటికీ, కొద్దిసేపటి తర్వాత ఆసక్తికరంగా మారుతుంది. ‘దాయర’లో బాగా వర్కవుట్ అయిన అంశం ఏదన్నా ఉంది అంటే, అది కథలోని ఇంటెన్సిటీకి తగినట్లుగా ఒక సీరియస్ వాతావరణాన్ని సృష్టించి, టెంపో కొన్ని చోట్ల మైంటైన్ చేయడం అని చెప్పొచ్చు. కొన్ని థ్రిల్ మూమెంట్స్ వల్ల ఫస్ట్ హాఫ్ కొంచెం పర్వాలేదనిపిస్తుంది.

పోలీస్ లకు, క్రిమినల్స్ నడుమ కొన్ని సీన్స్ బాగున్నాయి. పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై క్షితీ జోగ్ పై ఓ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. న్యాయం అంటే ఏమిటో తనకంటూ ఒక సొంత నిర్వచనం ఉన్న పోలీసు అధికారిగా పృథ్వీరాజ్ సుకుమారన్ మరోసారి మార్క్ సాలిడ్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో తను కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఇందులో తక్షణ న్యాయంకి అలాగే న్యాయవ్యవస్థ ద్వారా జరిగే న్యాయంకి నడుమ ఉన్న చిన్నపాటి తేడా కోసం చూపించడమే ప్రధాన లక్ష్యంగా ప్లాన్ చేశారు.. అయితే ఇదో ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు అయినప్పటికీ కథా నేపథ్యం, ఫస్ట్ హాఫ్ లు చూశాక, సెకండాఫ్ అంతా ఓ రేంజ్ లో మరింత గ్రిప్పింగ్ కథనంతో కూడిన సన్నివేశాలతో నిండి ఉంటుందని ఎవరైనా ఆశిస్తారు.

కానీ దురదృష్టవశాత్తు, ఈ సినిమాలో ఇద్దరు లీడ్స్ మధ్య అలాంటి డ్రామా ఎక్కడా కనిపించలేదు. ఒకే ఒక చిన్న సన్నివేశం, అది కూడా ఎక్కడో చివర్లో వస్తుంది. పైగా దాని ఎండింగ్ కూడా చాలా బలహీనంగా ఉండటం టోటల్ గా సినిమా ఫలితాన్నే దెబ్బ తీసేలా చేసాయి. ఒక ఫేక్ ఎన్కౌంటర్ చుట్టూ ఉండే భిన్నాభిప్రాయాలపై మరిన్ని చర్చలు జరపకుండా, ఈ అంశాన్ని పూర్తిగా వాడుకోకపోవడం నిజంగా డిజప్పాయింట్ చేస్తుంది.

అలాగే కరీనా కపూర్ ఖాన్‌కు స్క్రీన్ స్పేస్ తక్కువగా దక్కడం ఈ సినిమా పెద్దగా మెప్పించకపోవడానికి మరో ముఖ్య కారణం అని కూడా అనుకోవచ్చు. ఆశించిన ఇంపాక్ట్ తీసుకురావాలంటే ఆమె పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది. సెకండాఫ్ మొత్తం ఒక లక్ష్యం అనేది లేకుండా బోర్ గా సాగుతూ వెళుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. కేతన్ సోధా అందించిన నేపథ్య సంగీతం బాగుంది, సౌరభ్ గోస్వామి కెమెరా వర్క్ కూడా బాగుంది కొన్ని ఇంటర్‌కట్స్ చాలా నీట్‌గా చేశారు. ఎడిటింగ్ మాత్రం ఇంకా బెటర్ గా ప్లాన్ చేయాల్సింది.

ఇక మేఘనా గుల్జార్ దర్శకత్వం విషయానికి వస్తే.. ఆమె వర్క్ ఆశించిన స్థాయిలో లేదు. ఆమె గత చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా చాలా డల్ గా అనిపిస్తూ, ఏమాత్రం పస లేకుండా సాగుతుంది. సినిమా చూపించాలనుకున్న నైతిక పోరాటంలో ప్రేక్షకులను పూర్తిగా లీనం చేయడానికి పృథ్వీరాజ్ మరియు కరీనాల మధ్య తగినన్ని కాంబినేషన్ సన్నివేశాలు లేవు. కొన్ని సీరియస్ ఎలిమెంట్స్ పై ఆమె మరింత వర్క్ చేయాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకుంటే ‘దాయర’ లో ఇంపాక్ట్ కలిగించే సబ్జెక్ట్ ఉన్నప్పటికీ వాటిని ఆద్యంతం ఆసక్తిగా మలిచి కథనం లేకపోవడంతో థ్రిల్లర్ లవర్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. పృథ్వీరాజ్, కరీనా లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వారిని వినియోగించి మంచి డ్రామా ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవడం మరింత నిరాశ కలిగిస్తుంది. దర్శకత్వం కూడా లోపాలు, డల్ సెకండాఫ్, క్లైమాక్స్ లు ఈ సినిమా చూసే వీక్షకులను నీరుగారేలా చేస్తాయి. సో ఈ థ్రిల్లర్ ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here English Review

Share this post:

POLL

Who Will Vote For?

Other

Republican

Democrat

RECENT NEWS

Cyclone Arnab to make landfall near Kalingapatnam, Odisha, AP to witness heavy rain

Cyclone Arnab to make landfall near Kalingapatnam, Odisha, AP to witness heavy rain

The Paradise Overtakes The RajaSaab Before Release

The Paradise Overtakes The RajaSaab Before Release

‘I can start my senior career confidently’: Anahat Singh on the Asian Games and what comes next | Asian Games 2026 News

‘I can start my senior career confidently’: Anahat Singh on the Asian Games and what comes next | Asian Games 2026 News

Dynamic Country URL Go to Country Info Page