Ustaad Bhagat Singh Nizam Bookings: Single Screens Housefull

Ustaad Bhagat Singh
March 17, 2026

LATEST NEWS

Ustaad Bhagat Singh Nizam Bookings: Single Screens Housefull

Published on Mar 17, 2026 8:01 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినాను ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)అడ్వాన్స్ బుకింగ్స్ మరోసారి నిరూపిస్తున్నాయి. నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. బుకింగ్స్ మొదలైన కొద్దిసేపటికే సింగిల్ స్క్రీన్స్ అన్నీ దాదాపుగా హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. సంధ్య, భ్రమరాంబ, అర్జున్, శ్రీరాములు లాంటి థియేటర్లలో ఫ్యాన్స్ అప్పుడే టికెట్లు బుక్ చేసుకున్నారు. బుక్‌మైషో యాప్‌ ఓపెన్ చేస్తే ప్రధాన సెంటర్లలో ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి.

మల్టీప్లెక్స్‌లలోనూ అదే రెస్పాన్స్

సింగిల్ స్క్రీన్స్‌లో స్పందన ఇలా ఉంటే.. తాజాగా ఓపెన్ చేసిన కొన్ని మల్టీప్లెక్స్‌లలో కూడా బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఏఎంబీ సినిమాస్, ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఏఏ సినిమాస్, అపర్ణ లాంటి చోట్ల టికెట్లు ఓపెన్ చేసిన వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ వేగవంతం అయ్యాయి. చాలా షోలు ఇప్పటికే ఆరెంజ్ కలర్‌లోకి (ఫాస్ట్ ఫిల్లింగ్) మారిపోగా, మరికొన్ని షోలు దాదాపుగా ఫుల్ అయ్యే దశకు చేరాయి.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో పవన్ పవర్‌ఫుల్ పోలీస్ గెటప్‌లో కనిపించనుండటంతో తొలిరోజే సినిమాను చూడాలని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి కొన్ని మల్టీప్లెక్స్‌లలో మాత్రమే బుకింగ్స్ మొదలయ్యాయి. త్వరలోనే నైజాం వ్యాప్తంగా పూర్తిస్థాయిలో మల్టీప్లెక్స్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని మేకర్స్ తెలిపారు. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, పవన్ కళ్యాణ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Share this post:

POLL

Who Will Vote For?

Other

Republican

Democrat

RECENT NEWS

AP govt reviews LPG supply, assures No shortage

AP govt reviews LPG supply, assures No shortage

‘Iran has crossed every red line’: Gulf nations’ message to US amid escalating Middle East tensions

‘Iran has crossed every red line’: Gulf nations’ message to US amid escalating Middle East tensions

Sai Pallavi

Sai Pallavi in talks for Sanjay Bhansali’s Madhubala biopic

Dynamic Country URL Go to Country Info Page